పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిన రోడ్లు…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద డణపురం వయా హెబ్బటం రోడ్డు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు అమ్మో..! ఇదేమి రోడ్డురా బాబోయ్ అంటూ భయపడుతున్నారు. రోడ్డు గుంతలతో అధ్వాన్నంగా మారడంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితులు -నెలకొన్నాయి. ఈ రోడ్డు పై వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం, రోడ్డు అద్వానంగా మారడంతో గతంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యార్థులతోపాటు ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు ధర్నాలు, ఆందోళనలు చేపట్టిన పాలకులు గాని, సంబంధిత అధికారులు గానీ రోడ్డును మాత్రం బాగు చేయలేదు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం వివిధ పనుల నిమిత్తం వైద్యం కోసం ఈ రోడ్డుపైనే అదోనికి ప్రయాణించాల్సి ఉంటుంది. రైతులు తాము పండించిన పత్తి, వేరుశనగ తదితర పంటలను ఆదోని మార్కెట్ యార్డ్ కు తీసుకెళ్లి అమ్ముతుంటారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రతిరోజు ఆదోనిలోని వివిధకళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్నారు. అయితే రోడ్డు అధ్వానంగా మారడంతో విద్యార్థులు తమ ఉన్నత విద్యనుఅర్ధాంతరంగా మధ్యలోనే ఆపేస్తున్నారు.గత ప్రభుత్వంలో రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయని, ఇదిగో వేస్తాం.. అదిగో వేస్తాం అంటూ పాలకులు కాలం వెలిబు వ్యారే కాని రోడ్డు మాత్రం వేయలేదు. ప్రతి రోజూ వందల సంఖ్యలో వాహనాలు దహదారిపై తిరుగుతున్నప్పటికీ గుంతలు పడి ద్విరుద్ర వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు మారినా రోడ్ల పరిస్థితి ఇంతేనా అని అసలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్నాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిని మరింత అధ్వానంగామారడంతో రోడ్డుపై ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు గుంతలమయమై ఏళ్లుగడుస్తున్నా గాని అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు రోడ్డుపైన చూస్తూ వెళ్తున్న మరమ్మత్తులకు నోచుకోరని ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం దేపట్టాలని, పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రజలు అంటున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా రోడ్డును బాగు చేస్తారా…? లేదా…? వేచి చూడాలి మరి…