PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్యరంగంలో ప్రభుత్వ‌, ప్రైవేటు రంగాల పాత్ర కీల‌కం

1 min read

* బాధ్యతాయుతంగా వైద్యసేవ‌లు అందించాలి

* రాష్ట్ర వైద్య‌, ఆరోగ్యశాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌

* జూబ్లీహిల్స్‌లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ప్రారంభం

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : ప్రజ‌ల‌కు వైద్యసేవ‌లు అందించ‌డంలో ప్రభుత్వ‌, ప్రైవేటు రంగాలు రెండూ కీల‌క‌పాత్ర పోషించాల‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్యశాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అన్నారు. ఈ విష‌యంలో ప్రైవేటు రంగం మ‌రింత బాధ్యతాయుతంగా వైద్యసేవ‌లు అందించాల‌ని సూచించారు. జూబ్లీహిల్స్ ఫిలింన‌గ‌ర్‌లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖ‌ను ఆదివారం ఆయ‌న ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవ‌లి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వ‌ర‌కు ప్రతి ఒక్కరికీ జుట్టు రాల‌డం, ఇత‌ర చ‌ర్మ సంబంధిత ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని… వాటన్నింటికీ స‌మ‌గ్రంగా వైద్యసేవలు అందించ‌డానికి వీలుగా ఒకేచోట అన్నిర‌కాల వైద్యం చేసేందుకు ఈ ప్రాంతంలో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌ను ప్రారంభించ‌డం ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.  డాక్టర్ సృశాంత్ లాంటి యువ‌కులు ఈ రంగంలో అత్యాధునిక ప‌ద్ధతులు పాటిస్తూ ప్రజ‌ల‌కు త‌మ‌వంతు సేవ‌లు అందించాల‌ని సూచించారు. ఈ దిశ‌గా డాక్టర్ సృశాంత్, ఆయ‌న బృందం మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం సంద‌ర్భంగా డాక్టర్ సృశాంత్ ముక్కా మాట్లాడుతూ, “ఇప్పటికే కోకాపేట‌లో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్న మేము.. ఇప్పుడు న‌గ‌ర‌వాసుల‌కు కూడా సేవ‌లందించేందుకు వీలుగా జూబ్లీహిల్స్‌లో సువిశాల ప్రాంగ‌ణంలో ఆస్పత్రిని ఏర్పాటుచేశాం. ఇక్కడ కేవ‌లం ఒక్కరే కాకుండా.. అన్నిర‌కాల చ‌ర్మ‌, శ‌రీర‌, జుట్టు స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన వైద్యులు, మ‌హిళా వైద్యులు, కాస్మెటాల‌జిస్టులు, డెర్మటాల‌జిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. అందువ‌ల్ల సాధార‌ణ చ‌ర్మసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి సోరియాసిస్ లాంటి తీవ్ర స‌మ‌స్యల వ‌ర‌కు.. అలాగే జుట్టు రాల‌డం, పూర్తిగా  ఊడిపోవ‌డండ లాంటి తీవ్రమైన ఇబ్బందుల వ‌ర‌కు అన్నింటికీ చికిత్సలు అందిస్తాం. అలాగే కాస్మెటిక్ చికిత్సలు కూడా ఇక్కడ అందించ‌గ‌లం. శ‌రీరంలోని గుప్తభాగాల‌కు సంబంధించిన స‌మ‌స్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నా.. వాటికి సైతం స‌మ‌ర్థవంతంగా చికిత్సలు చేయ‌గ‌ల స‌దుపాయాలు ఇక్కడ ఉన్నాయి. గ‌తంలో 50-60 ఏళ్లు దాటిన త‌ర్వాతే జుట్టు రాల‌డం, ఊడిపోవ‌డం, బ‌ట్టత‌ల ఏర్పడ‌టం లాంటి స‌మ‌స్యలు ఉండేవి. కానీ ఇప్పుడ‌వి 18-20 ఏళ్ల వ‌య‌సులో కూడా వ‌స్తున్నాయి. దీనివ‌ల్ల చాలామంది యువ‌తీ యువ‌కులు ఇబ్బంది ప‌డుతూ కాలేజీల‌కు వెళ్ల‌డం కూడా మానుకుంటున్నారు. ఇలాంటివారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ లాంటి చికిత్సలు చేసి, వారిలో మ‌ళ్లీ ఆత్మవిశ్వాసం నింప‌డం, వారిని మ‌ళ్లీ కాలేజీకి పంప‌డం లాంటివి చేస్తున్నాం. ఇక్కడ మా ఆస్పత్రిలో పీడియాట్రిక్ డెర్మటాల‌జీ నుంచి.. అంటే ప‌దేళ్ల వ‌య‌సు వారికి వ‌చ్చే స‌మ‌స్యల నుంచి మొద‌లుపెట్టి జేరియాట్రిక్  స‌మ‌స్యలు.. అంటే వ‌యోవృద్ధుల‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధిత‌, ఇత‌ర స‌మ‌స్యల వ‌ర‌కు అన్నింటికీ చికిత్సలు అందించ‌డానికి అంత‌ర్జాతీయ స్థాయి ప‌రిక‌రాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంబంధించి వ్యక్తిగ‌తీక‌రించిన చికిత్సలు అందించ‌డం ఇక్కడ మా ప్రత్యేక‌త‌. చ‌ర్మ స‌మ‌స్యలు అనేక ర‌కాలుగా ఉంటాయి. డెంగ్యూ, చికున్ గ‌న్యా లాంటివాటిలో కూడా చ‌ర్మస‌మ‌స్యలు కొన్ని వ‌స్తాయి. రోజూ త‌డిలో ప‌నిచేసే గృహిణుల‌కు కాళ్ల వ‌ద్ద ఫంగ‌ల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడ‌తాయి. ఇలాంటివాటిని నిర్లక్ష్యం చేయ‌కూడ‌దు. ఎప్పటిక‌ప్పుడు చ‌ర్మ‌వైద్యుల‌కు చూపించుకుని దానికి త‌గి చికిత్స తీసుకోవాలి. మొటిమ‌ల‌కు కూడా ఏవి ప‌డితే ఆ క్రీములు వాడ‌టం కాకుండా.. స‌రైన చికిత్స చేయించుకోవాలి” అని తెలిపారు.

About Author