సమాజంలో మీడియా పాత్ర కీలకం
1 min readఅమ్మ, ఆర్క్ హాస్పిటల్ ఎం.డి డా. త్రినాథ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు, : ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించే మీడియా.. దేశాభివృద్ధిలోనూ ప్రధాన పాత్ర పోషించాలన్నారు అమ్మ, ఆర్క్ హాస్పిటల్ ఎం.డి డా. త్రినాథ్ . శనివారం పల్లెవెలుగు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వాస్తవాల కంటే… అవాస్తవాలే విపరీతంగా ట్రోల్ అవుతున్నాయని.. అలా కాకుండా పత్రికలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వాస్తవాలు రాసే పత్రికలలో పల్లెవెలుగు దినపత్రిక ఒకటని ప్రశంసించారు. మున్ముందు అన్ని రంగాలకు సంబంధించి… మంచి సందేశాత్మక వార్తలు రాయాలని అమ్మ, ఆర్క్ హాస్పిటల్ ఎం.డి డా. త్రినాథ్ ఆకాంక్షించారు.