స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివి
1 min readటిటిడి నియోజకవర్గ నాయకులు రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివి అని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ నాయకులు మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. గురువారం 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరి కి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్ధినులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. శాంతి కి చిహ్నాం గా పావురాలను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఉందని అన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకుంటూ, మన దేశ వీరులు మరియు జవాన్లు మనకు స్ఫూర్తి అంటూ కొనియాడారు. విద్యార్థిని విద్యార్థులు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ మానిసిక ఉల్లాస పోటిల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హంపయ్య, పిఈటి ఉపాధ్యాయులు, ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్, మంత్రాలయం స్కూల్ చైర్మన్ నరసింహ, టిడిపి నాయకులు వరదరాజు,అశోక్ రెడ్డి, నరసింహ,లక్ష్మన్న, రఘు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.