వర్షానికి నష్టపోయిన పంటను పరిశీలించిన వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలను మంగళవారం నాడు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గడివేముల మండల పరిధిలోని మంచాలకట్ట గని గ్రామాలలో రైతుల కులాలను పరిశీలించారు. వర్షానికి దెబ్బతిన్న కంది పంట మొక్కజొన్న మరియు సోయాబీన్ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న కంది పంట పొలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు, పొలాల్లో నిలువ ఉన్న నీళ్లను బయటికి పంపించేయాలని నత్రజని 20 కేజీలు పొటాష్ 10 కేజీలు చల్లాలని . వాడిపోయిన కంది మొక్కలకు కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కల వేర్లు తడిచేలా పిచికారి చేయాలన్నారు. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ పంటను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. మొక్కజొన్న పంటలో సస్యరక్షణతో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో అధిక పంటను పండించవచ్చని కొన్నిచోట్ల మొక్కజొన్న ఏపుగా పెరిగిన కంకిలో విత్తనాలు రాకపోవడం పై పరిశీలించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఈ వెంకటరమణ (బ్రీడింగ్ ). కే అశోక్ కుమార్ (ఆగ్రోనోమి). కే వెంకటరమణ (పి ఎల్ పాత్). ఎస్ ఇషా ప్రవీణ్. (బ్రీడింగ్). మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి వీ ఏవోలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.