PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిసెంబర్ 31 లోపు రెండవ దశ 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించాలి

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  డిసెంబర్ 31 వ తేది లోపు రెండవ దశ 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా  అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వంద రోజులు లక్ష్యాలపై (ఫేజ్-II) కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా  అన్ని శాఖలకు సంబంధించిన రెండవ దశ  వంద రోజుల లక్ష్యాల సాధన పై కలెక్టర్ సమీక్షించారు..లక్ష్యాల సాధనలో వెనుకబడకూడదని అధికారులను ఆదేశించారు.. వ్యవసాయ శాఖకు సంబంధించి 100 రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న విత్తన పంపిణీ,  పొలం పిలుస్తోంది తదితర కార్యక్రమాలను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తిచేయాలని కలెక్టర్ డీఏవో ను ఆదేశించారు. అలాగే 95 కిచెన్ గార్డెన్స్, 50 స్కూల్ న్యూట్రిగార్డెన్స్ ను కూడా పూర్తిచేయాలని సూచించారు. సెరికల్చర్ కి సంబంధించి 12 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్, కిసాన్ నర్సరీ ల పెంపకం, బైవోల్టీన్ కకూన్స్ హార్వెస్టింగ్, తదితర కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు..నిర్దేశించిన లక్ష్యం మేరకు చేపలు,  రొయ్యల ఉత్పత్తి, ఫిషింగ్ లైసెన్సుల జారీ, ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు….వంద రోజుల్లో 200 ఎకరాల్లో ఉద్యాన పంటల ఏరియా విస్తరణతో పాటు ఆయిల్ పాం ఏరియా విస్తరణ పై కూడా దృష్టి పెట్టాలని కలెక్టర్ ఉద్యాన శాఖ అధికారులు ఆదేశించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి NREGS కింద చేపడుతున్న 1200 గోకులం లను  వంద రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ డ్వామా అధికారిని ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి 300 MSME లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని సాధించడం తో పాటు వీటి ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించాము అన్న వివరాలను పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు  తెలియచేయాలని సూచించారు.. ఉపాధి పొందిన వారి వివరాలు  కార్మిక శాఖ వద్ద కూడా తప్పనిసరిగా ఉండాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ కార్మిక శాఖ అధికారిని ఆదేశించారు.. విద్యుత్ శాఖకు సంబంధించి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద   ఎక్కువ మంది వినియోగదారులను గుర్తించాలని సూచించారు.. పుచ్చకాయలమాడ గ్రామంలో బుక్ చేసుకున్న 6 మందికి వెంటనే సోలార్ విద్యుత్ అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. అటవీ శాఖ సంబంధించి శాఖ కార్యక్రమాల తో పాటు ఎన్ఆర్ఈజీఎస్, అటవీ శాఖ కన్వర్జెన్స్ తో చేపట్టే కార్యక్రమాలను కూడా 100 రోజుల లక్ష్యాలలో చేర్చాలని కలెక్టర్ ఆదేశించారు.రవాణా శాఖకు సంబంధించి చిన్నటేకూరు  గ్రామం వద్ద ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ నిర్వహణ పై కలెక్టర్ అర తీశారు.. విద్యా శాఖకు సంబంధించి  10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారా ఆన్లైన్ లో పాఠాలు బోధించేందుకు  నెల లోపు  జిల్లా స్థాయిలో వర్చువల్ క్లాస్ రూం ను  ఏర్పాటు చేయాలని, ఇది పెద్ద ల్యాబొరేటరీ లా ఉండాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు..స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా ఇచ్చిన  శిక్షణ వల్ల,జాబ్ మేళాల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అన్న వివరాలను పత్రికా ప్రకటన  తో పాటు ఆన్లైన్ పోర్టల్ లో కూడా అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఉపాధి కల్పన శాఖ అధికారులను, స్కిల్ డెవలప్మెంట్ అధికారులను  ఆదేశించారు.తుగ్గలి  గిరిజన సంక్షేమ పాఠశాలకు రూ.4.5 లక్షలతో కాంపౌండ్ వాల్  మంజూరు చేశామని, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి టాయిలెట్ అవసరం ఉన్న వసతి గృహాలన్నిటికీ ఎస్టిమేట్ లను సిద్ధం చేయాలని, స్వచ్ఛ భారత్ కింద వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.. వీటిని ఆర్డబ్ల్యూఎస్, ఎపిఈడబ్ల్యు ఐడిసి ల ఆధ్వర్యంలో నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు..కర్నూలు కార్పొరేషన్ కు సంబంధించి నగరంలో  మెయిన్ రోడ్ లలో గుంతలు ఉన్నాయని, వాటికి ప్యాచ్ వర్క్ లను కూడా లక్ష్యంలో చేర్చాలని   కలెక్టర్ ఆదేశించారు.  పంచాయతీ రాజ్ కి సంబంధించి  52 కోట్ల రూపాయలతో పల్లె పండుగ ద్వారా చేపడుతున్న  70 కిలోమీటర్ల సీసీ రోడ్ల ను సంక్రాంతి లోపు  పూర్తి చేయాల్సి ఉందని, కలెక్టర్ పంచాయతీరాజ్ ఎస్ఈ ని  ఆదేశించారు.చెత్త సంపద తయారీ కేంద్రాలను త్వరితగతిన ఆపరేషన్ లోకి తీసుకొని రావాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.  హౌసింగ్ కి సంబంధించి డిసెంబర్ 31 వ తేది నాటికి 4 వేల 672 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..మిగిలిన శాఖలకు సంబంధించిన లక్ష్యాలను కూడా కలెక్టర్ సమీక్షించారు.”పల్లె పండుగ” ను  విజయవంతంగా నిర్వహించాలి. జిల్లాలో అక్టోబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు చేపట్టనున్న “పల్లె పండుగ” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ఈ కార్యక్రమంలో భాగంగా  ఎన్ఆర్ఈజీఎస్ కింద సిసి రోడ్లు, బిటి రోడ్లు, హార్టికల్చర్ ప్లాంటేషన్, గోకులంలకి సంబంధించి 100 కోట్లకు పైగా పనులను మంజూరు చేశామని, వీటికి శంకుస్థాపనలు చేసి పనులు మొదలు పెట్టాలన్నారు.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు   “పల్లె పండుగ” కార్యక్రమంలో పాల్గొంటారని,  అందుకు సంబంధించి గ్రామాల వారీగా షెడ్యూల్ ను ఈ రోజు లోపు పంపాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈఓ ను  ఆదేశించారు.సమావేశంలో సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *