ఘంటసాల గానం మధురాతి మధురం….
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102 వ జన్మదిన వేడుకలు కర్నూలు నగరం నందలి ఘంటసాల కూడలిలో ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించారు. ఘంటసాల జన్మదిన కార్యక్రమానికి డి.ఎస్.పి మహబూబ్ బాషా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం అధ్యక్షులు బైలుప్పల షఫీయుల్లా, కవి రచయిత డిపార్వతయ్య, కర్నూలు నగర గాయకులు రమేష్ బాబు, నాగ శేషు, శ్రీశైల భ్రమరాంబిక కళా సమితి అధ్యక్షులు డి పుల్లయ్య ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భలే మంచి రోజు, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఏనుగునికి పెక్కేనుంగునెక్కి, పాండవ వనవాసం, లవకుశ సినిమా పాటలు పద్యాలు పాడి అమర జీవితం ఘనంగా నివాళులర్పించారు. తెలుగు వారి ప్రతి ఇంట ఘంటసాల భగవద్గీత, వినిపిస్తోంది. ఘంటసాల సుమధుర, విరహ, ఆవేదన, జానపద గీతాలు తెలుగు భాషలోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో పాడి విశేష ఆదరణ పొందిన జాతీయ గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు , కర్నూలు రంగస్థలం కళాకారులు ఘంటసాల అభిమానులు ఘంటసాల అమర్ రహే అమర్ రహే అంటూ జోహార్లు తెలిపారు.