టిడిపి ప్రభుత్వంలోనే పెన్షనర్ల సమస్యలకు పరిష్కారం..
1 min readఏపీ పెన్షనర్స్ అసోయేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు గెలుపు.. పెన్షనర్ల పిలుపు కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తమ ప్రభుత్వంలో తప్పకుండా పరిష్కరిస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. మౌర్య ఇన్లోని పరిణయ హాల్లో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి ఆధ్వర్యంలో చంద్రబాబు గెలుపు.. పెన్షనర్ల పిలుపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి.జి భరత్తో పాటు ఎంపీ సంజీవ కుమార్, ఎమ్మెల్సీ బీ.టి నాయుడు, గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గెలుపు.. పెన్షనర్ల పిలుపు కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్నారు. అన్ని రంగాల ప్రజలు ఈ ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. తమ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇక కర్నూల్లో తన పనితీరు ఇంతవరకు ప్రజలు చూడలేదన్నారు. ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే నగరాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తమపై సృష్టించే లేనిపోని తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఆయన విజ్నప్తి చేశారు. తాము సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉన్నట్లు టి.జి భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియన్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పూర్ణ చంద్రరావు, ఏపీ సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ మాజీ అధ్యక్షులు గురువయ్య, మెడికల్ ఎంప్లాయిస్ మాజీ అధ్యక్షులు విస్డం చౌదరి, కర్నూలు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు క్రిష్టఫర్, రిటైర్డ్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.