షెడ్యూల్ తెగల(ఎస్ టి) సమస్యలపై ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాం..
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మరియు డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి అనుమతితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన షెడ్యూల్ తెగల(ఎస్ టి) సమస్యలపై సూచన మరియు పరిష్కార కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి పెనుబడి మధు కుమార్ పాల్గొని రాష్ట్రంలో షెడ్యూల్ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా గ్రామ మరియు మండల స్థాయిలో ఉండే ఎస్టీ కాలనీలో నీరు ,విద్యుత్, రోడ్లు , ఎస్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి మరియు సంక్షేమానికి అలాగే వివిధ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు మరియు ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దృష్టికి తీసుకువెళ్లారు. గౌరవ మంత్రివర్యులు సమస్యలపై వెంటనే స్పందించి ఈనెల 22వ తారీఖున వారి శాఖ యందు కలవాలంటూ సూచించినట్టు ఆయన పేర్కొన్నారు.