PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీడీఓ మృతికి శ్రద్ధాంజలి ఘటించిన సిబ్బంది..

1 min read

సీఎం..డిప్యూటీ సీఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఈనెల 15న విజయవాడలో నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు అదృశ్యం అయ్యారు.అదే రోజున సూసైడ్ నోటు రాసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పంపించారు.కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలతో గాలిస్తుండగా సెల్ ఫోన్ ఆధారంగా తొమ్మిది రోజులకు కాలువలో ఎంపీడీవో బాడీని మంగళవారం గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంఘటన జరిగిన రోజునే ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్నా సరే వదిలిపెట్టవద్దని అధికారులకు వారు ఆదేశాలు జారీ చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీడీఓ నరేష్ కృష్ణ,ఈఓఆర్డి సంజన్న, పంచాయితీ కార్యదర్శులు మరియు సిబ్బందితో మృతి చెందిన ఎంపీడీవో వెంకట రమణారావు కు వారు శ్రద్ధాంజలి ఘటిస్తూ పంచాయి తీరాజ్ సంఘం ఆదేశాల మేరకు నిరసన వ్యక్తం చేశారు.ఎంపీడీఓ నరేష్ కృష్ణ మాట్లాడుతూ ఎంపీడీవో పనిచేసే మండలంలో ఒక ఫెర్రీ కి 55 లక్షల రూ.లు కాంట్రాక్టర్ చెల్లించకుండా ఎంపీడీవో ను వేధిస్తూ బెదిరించాడు.గత ప్రభుత్వ రాజకీయ నాయకుడి అండతో ఆయనపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన చనిపోయారని రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకురావడం సంస్కృతినీ వీడాలని ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే తోటి వారితో సమస్యలు చెప్పుకోవాలే గానీ ఇలాంటి దురదృష్టకర ఆత్మహత్యలకు పాల్పడడం కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం మంచిది కాదన్నారు. ఎంపీడీవో మృతికి కారణమైన వారిని ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కౌసల్య, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్,రవి,నూరుల్లా, గోపాల్,రహీం తదితరులు పాల్గొన్నారు.

About Author