PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ పాలన కొనసాగాలంటే రాష్ట్రానికి మళ్లీ సీఎం జగన్ ఎంతో అవసరం

1 min read

– సీకే దీన్నే జడ్పిటిసి నరేన్ రామన్జులా రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని, ఆయనను ఆదరించాలని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు పోచం నరేన్ రామా0జుల రెడ్డి అన్నారు, బుధవారం ఆయన చెన్నూరు లోని అరుంధతి నగర్, సుగాలి కాలనీ, ఎల్లమ్మ కాలనీలలో వైఎస్ఆర్సిపి నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని,ప్రతి కుటుంభం లో మేలు జరిగివుంటేనే మళ్ళీ వైస్సార్సీపీ కి పట్టం కట్టాలని, చెప్పే ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు, మైనారిటీ కాలనీ లలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తో కలసి ఆయన ఇంటింటికి వెళ్లి ఆఇంటికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగిన మేలును వచ్చిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది, అవ్వ తాతలకు, ఒకటో తేదీననే వాలంటీర్లచే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు, కుల ,మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు, అలాగే ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ని , ఎంపీ అవినాష్ రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు,అలాగే ఎంఎల్ఏ రవీంద్ర నాద రెడ్డి కమలాపురం

నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి

పధంలో నడిపి అందరికి అందుబాటులో ఉంటు ఏసమస్య ఉన్న ఆయన దృష్టికి తీసుకెళితే ఆయన వెంటనే స్పందించి ఆయా పనులను త్వరగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు, ఆయనను ఎంపీ అవినాష్ రెడ్డిని మండల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు, అదేవిధంగా రామనపల్లిలో టిటిడి బోర్డు మెంబర్ మాసీమ బాబు, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, ఉప సర్పంచ్ పుత్త వేణుగోపాల్ రెడ్డి, నాయకులు చంద్ర మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి కి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య, గంగిశెట్టి, సుధాకర్, శంకర్, కిట్టు, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య యాదవ్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఆర్ వి ఎస్ ఆర్, గణేష్ రెడ్డి, సొంతం నారాయణరెడ్డి, గుమ్మల మధుసూదన్ రెడ్డి, మెడికల్ రవి రెడ్డి, ఆర్ ఎస్ ఆర్, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, ఆరవేటి శ్రీనివాసులు, గణేష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, రఘురాం రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author