PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృక్షో రక్షిత రక్షిత.. అమ్మ కోసం..ఒక మొక్క నాటండి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మొక్కలు నాటి వాటిని సంరక్షించి కాపాడే బాధ్యత మనందరిపై ఉందని బిజెపి కర్నూలు జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ అన్నారు. గురువారం పత్తికొండలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఆవరణంలో పత్తికొండ బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుతో ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు తల్లికి వందనం పేరుతో అమ్మ కోసం ఒక మొక్క అనే సంకల్పంతో మొక్కలు నాటండి వాటి సంరక్షణ వాటి బాధ్యత మీరే తీసుకుని అవి దృఢంగా చెట్లు పెరిగే వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడితే మన దేశంలో ప్రజలకు మున్ముందు భావితరాల వారికి ఎంతో రక్షణ కవచంలా పర్యావరణం నిలుస్తుందని అందుకే ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కచ్చితంగా ఒక మొక్కను నాటండి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పత్తికొండ బిజెపి పార్టీ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్ వార్డెన్, విద్యార్థులతో కలిసి హాస్టల్ ఆవరణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మాజీ జిల్లా కన్వీనర్ కరణం నరేష్, ఏబీవీపీ జిల్లా మాజీ కో కన్వీనర్ సోమన్న, బిజెపి స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ మల్లికార్జున, కిసాన్ మోర్చా అసెంబ్లీ ఇంచార్జ్ సిసి రంగన్న, పట్టణ నాయకులు రామ్మోహన్, తుగ్గలి మండల అధ్యక్షుడు లక్ష్మణ స్వామి నాయుడు, కిసాన్ మోర్చా కార్యదర్శి రాంపల్లి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author