వైయస్ఆర్ విగ్రహం అవమానించిన గుర్తు తెలియని దుండగులను శిక్షించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడలి నందు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అవమానించిన గుర్తు తెలియని దుండగులను శిక్షించాలని ఎమ్మిగనూరు పట్టణ సిఐ కి వైయస్ఆర్ సిపి శ్రేణులు ఫిర్యాదు చేసి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైయస్ఆర్ సిపి వీరశైవ లింగాయత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వై రుద్ర గౌడ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్, కౌన్సిలర్ నాగేషప్ప, ఎమ్మిగనూరు మండల ఎంపీపీ కేశన్న, కోటేకల్ సర్పంచ్ లక్ష్మన్న లు మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణం నందు మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని గుర్తుతెలియని వ్యక్తులు అవమానించడం జరిగింది ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నాము మహనీయుల విగ్రహాలను అవమానించడం చాలా బాధాకరమని ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను పోలీసు వారు వెంటనే పట్టుకుని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మిగనూరు పట్టణ సిఐ కి ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, మాజీ రాష్ట్ర షాప్ నెట్వర్క్ చైర్మన్ మాచాని వెంకటేష్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ యు కె రాజశేఖర్, కౌన్సిలర్లు ఖాసిం బెగ్, శివ ప్రసాద్,నీలకంఠ, ఇన్చార్జిలు మాధవస్వామి, సోమేశ్, చంద్రశేఖర్, వడ్డే వీరేష్,సయ్యద్ ఫయాజ్,అల్తాఫ్, గురువ మాభాష, గడ్డం అంజి,బసరకోడు రమేష్, డిష్ రఫిక్, హనీఫ్, షేక్ చాంద్, వినయ్ రెడ్డి, మల్లికార్జున, ప్రకాష్ రెడ్డి, సూర్య ప్రకాశ్ రెడ్డి, మల్లికార్జున, వీరారెడ్డి, చంద్రశేఖర్, నబి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.