కమిషనర్ ను కలిసిన ఉద్యోగ సంఘం నేతలు..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకాప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)కార్యవర్గం యూనియన్ నేతలు నందికొట్కూరు నూతన మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ ని మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ సంఘం తాలూకా అధ్యక్షులు బాలరాజు,ప్రధాన కార్యదర్శి నర్సరాజు ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఉద్యోగ సంఘం కమిటీ ఏర్పడిన తర్వాత ఎన్నికైన కార్యవర్గానికి మున్సిపల్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు మరియు నర్సరాజు, సహాధ్యక్షుడు రషీద్, కోశాధికారి రాముడు, ఉపాధ్యక్షులు భువనేశ్వరి,సెక్రటరీలు శ్రీనివాసులు,టైపిస్ట్ వెంకటేశ్వర్లు మరియు నందికొట్కూరు విఆర్ఓ లు ఆనంద్,శ్రీనివాసులు,బుద్ధకవి, స్వామన్న మరియు ఇరిగేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.