తహసిల్దార్ ను కలిసిన ఉద్యోగ సంఘం నేతలు..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా(ఏపీజీఈఏ)ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ నేతలు నందికొట్కూరు తాలూకా నూతన కార్యవర్గం ఈనెల 18వ తేదీన ఉద్యోగుల సంఘం తాలూకా నూతన కమిటీ ఎంపిక అయింది. తహసీల్దార్ బి శ్రీనివాసులు ను తాలూకా అధ్యక్షులు బాలరాజు,ప్రధాన కార్యదర్శి నర్సరాజు ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నూతనంగా నందికొట్కూరు కార్యవర్గంనకు ఎన్నికైన వారికి తహసీల్దార్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గ ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తానని ఉద్యోగ సంఘం నేతలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు మరియు నర్సరాజు, సహాధ్యక్షుడు రషీద్, ఉపాధ్యక్షురాలు భువనేశ్వరి,సెక్రటరీ శ్రీనివాసులు మరియు నందికొట్కూరు వీఆర్ఓ లు మరియు ఇరిగేషన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.