PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వక్ఫ్ సవరణ బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకించాలి..

1 min read

హొళగుంద ముస్లిమ్ జాయిట్ యాక్షన్ కమిటీ(JAC)

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : ఇస్లాం ధర్మ ఆవిర్భావము నుండి నేటివరకు ముస్లిములు తమ ధార్మిక మరియు సామాజిక అభ్యున్నతికై ముస్లిముల దాన ధర్మాల నుండి ఏకం చేసిన సంపద నిధి స్వాసంత్ర్య భారతంలో 1954లో రాజ్యాంగబద్ధ ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ గా చట్టభద్దట చెంది 1995 లో చట్టపర మార్పులతో మరింత సధృడతను పొందింది.కాగా సదరు చట్టాన్ని నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం తేవబోతున్న వక్ఫ్ సవరణ బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోనున్న CMO క్యాంప్ ఆఫీసులో కలిసి వివరణలతో కూడిన సమగ్ర సమాచార వినతిపత్రాన్ని హొళగుంద ముస్లిమ్ మైనారిటీ JAC నాయకులు కే. ఖాదర్ బాషా,N, సుబాన్ మంగళవారం అందించడం జరిగింది.ముఖ్యమంత్రి గారికి వినతి ద్వారా విన్నవిస్తూ నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆమెండ్మెంట్-2024 ద్వారా 40 వివక్షపూరిత సవరణలతో ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ సవరణ బిల్లు తీవ్ర ఆక్షేపర్హంగా ఉండడంతో పాటుగా ముస్లిమ్ మైనారిటీల ధార్మిక మరియు సామాజిక భావనాలకు భంగం వాటిల్లేల విద్వేశాన్ని కలిగియున్నదని మరియు వక్ఫ్ బోర్డు పరిరక్షణ పర్యవేక్షణకై ఏర్పాటైన చట్టభద్ద వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ లో కేంద్రపు ఉద్దేశపూర్వక రాజకీయ జోక్యం యావత్తు ముస్లిమ్ సమాజానికి అయిష్టత మరియు అభద్రతకు గురించేసిందని, అంతేకాక నేడు దేశావ్యాప్తంగా ముస్లిముల దాన సంపదైన కొట్లాది విలువైన వక్ఫ్ ఆస్థులు ఆక్రమణకు గురవ్వడమే కాక ఉన్న ఆస్థులు, ఆస్థానాలు మరెన్నో చారిత్రత్మాక కట్టడాలకు కూడా సంరక్షణ కరువయ్యిందని తెలిపారు.కావున ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆమెండ్మెంట్-2024 సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన 31 మంది ప్రతినిధుల కమిటీలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయులు  కూడా సభ్యులుగా ఉన్నందున  తమరు, వారు మరియు పార్టీ అధిష్టానం కూడా ముస్లిమ్ మైనారిటీల సంరక్షణ సాధికారతకై వక్ఫ్ బోర్డు ఆమెండ్మెంట్-2024 బిల్లును సంపూర్ణం వ్యతిరేకించి తీవ్ర విరోధాన్ని వ్యక్తపర్చాలని కోరడమైంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ మేము ఈ విషయంపై సమీక్షిస్థామని తెలిపారు.తదనంతరం విజయవాడ వరద బాధితులకై *వరద బాధిత సహాయ సమైఖ్య తరుపున హొళగుంద మండలంలో మానవీయ దాతల నుండి సేకరించిన 5లక్షల విరాళాలను రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కి అందించే కార్యక్రమంలో కూడా తమవంతుగా పాలు పంచుకున్నట్లు తెలిపారు.

About Author