వక్ఫ్ బోర్డు చట్టంలో ప్రభుత్వం కుట్రపూరిత సవరణను వెంటనే అపాలి
1 min readహొళగుంద ముస్లిమ్ జేఏసి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : భారతీయ ముస్లిముల ధార్మిక సంపద సంస్థ “ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు” లో అనవసర జోక్యంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా ఇస్లాం ధర్మపు ధార్మిక భావాననాలకు భంగం వాటిల్లేలా తేవబోతున్న ప్రజాస్వామ్య విరోధ చట్టం “వక్ఫ్ బోర్డు సవరణ-2024” కు వ్యతిరేకంగా శుక్రవారం నాడు స్థానిక బస్టాండ్ కూడలిలో హొళగుంద ముస్లిమ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరుపున ప్రజాస్వామ్యబద్ధంగా పెద్దఎత్తున నిరసనను నిర్వహించారు.నిరసన కార్యక్రమంలో వక్తలు జామియా మసీదు పండితులు మౌలానా హాబిబుల్లా జామయి గారు మాట్లాడుతూ ఇస్లాం పరిభాషలో వక్ఫ్ అంటే ఒక ముస్లిము వ్యక్తి దైవభక్తి మరియు ప్రేమతో ఇస్లాం ధర్మం మరియు ముస్లిముల అభ్యున్నతికై, తన స్వంతానికి చెందిన ధనాన్ని, వస్తువులను లేదా ఆస్తిని నిరాపేక్షంగా ధర్మ మార్గంలో అప్పజెప్పడాన్ని వక్ఫ్ అంటారు. మరియు ఒకసారి ఒక వ్యక్తి లేదా సంస్థ ఇస్లాం ధర్మ మార్గంలో తమకు చెందినదానిని దానపు ఉద్దేశంతో వక్ఫ్(శాశ్వత దానం) చేస్తె సదరు ఖరీదు లేదా ఆస్థులపై సంపూర్ణ శాశ్వత యాజమాన్య అధికారం వక్ఫ్ బోర్డుకు చెందితీరుతుంది. అంతేకాకుండా భారత రాజ్యంగంప్రకారం సదరు వక్ఫ్ సంపదలకు సంబంధంచిన పరిపాలన పర్యావేక్షణ విషయంలో ‘ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు’కు సంపూర్ణంగా హక్కు బాధ్యతలున్నాయి. కాగా ప్రభుత్వం కూడా భారతీయ నాగరిక సంపద పరిరక్షణకు పాటుపడాలే తప్ప వాటిని నిర్విర్యం చేసే మార్గాలను ఉత్పన్నం చేయకూడదన్నారు.హాఫీజ్ శమీవుల్లా జామయి గారు ప్రసంగిస్తూ ఇస్లాం ధర్మ శాస్త్రం ప్రకారంగా దాదాపు 1446 సంవత్సరాల ప్రాచీన హిజ్రీ కాలం క్రితం నుండే ఇస్లాంలో ధార్మిక సంపద సంస్థగా వక్ఫ్ బోర్డు పరంపర కొనసాగుతుంది. మరియు స్వతంత్ర్య భారతదేశంలో 1954లో రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తిగల ధార్మిక సంస్థగా ‘ఆల్ ఇండియా వక్ఫ్ బోర్డు’ సర్వధికారాలతో ఏర్పాటు కాబడి, నేడు భారతదేశంలోనే అధికారికంగా అత్యధిక సంపద కలిగిన మూడవ అతిపెద్ద సంస్థగా పెరుగంచి, దేశావ్యాప్తంగా దాదాపు 9లక్షల పై చిలుకు స్వాసంత్ర్య ఆస్తులను కలిగియున్న జాతీయ వక్ఫ్ బోర్డు తన స్వయం అధికారంలోని సెక్షన్ 9(1) నిబంధన ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల వక్ఫ్ బొర్డు శాఖలపై పరిపాలన మరియు పర్యవేక్షణ సర్వధికారాలను కలిగి ఉంటుంది. కాగా సంబంధిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వక్ఫ్ బోర్డుకు వారి పర్యావేక్షణ, సంరక్షణకు తగిన సంపూర్ణ సహాయ సహాకారాల రక్షణ తోడ్పాటును అందించాల్సి ఉండగా కంచే చేను మేసినట్టు కబ్జాకు గురైన వేల కోట్ల వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే తన బాధ్యతను మరిచి వక్ఫ్ బోర్డును నిర్విర్యపరిచే కుట్రలో భాగంగా కేంద్ర మతతత్వ బిజెపి తెచ్చిన ప్రవేశపెట్టిన “వక్ఫ్ బోర్డు సవరణ-2024” చట్టాన్ని నేడు యావత్ భారతీయ ముస్లిములు మరియు సెక్యులర్ వాదులు ముక్తకంఠంతో వ్యతిరేకస్తున్నారని ప్రభుత్వం కూడా ధార్మిక సంస్థలలో తన విద్వేశపూరిత జోక్యాన్ని విరమించి వెంటనే ఈ “వక్ఫ్ బోర్డు సవరణ-2024” చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరో వక్త హాఫిజ్ కబీర్ నయిమి గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ నేటి ఫ్యాసీస్టు కేంద్ర ప్రభుత్వం సర్వ ధర్మాల వారు కలికట్టుగా సాధించుకున్న జాతీయతను జాతికి పరిమితం చేసి దిగజారిపోతున్న దేశ జీడిపి పై మరియు ప్రజా సంకష్టాలపై దృష్టి సారించడం మాని అదే పనిగా మతతత్వ అజెండాలను అమలుచేస్తూ ధర్మాలపై పడి ఒక ధర్మంపై తన విద్వేశాన్ని కేంద్రీకరించి, ఒక సమూహపు అస్తిత్వాన్ని అంతమొందించే మతతత్వ కపటత్వంతో నిరంతరం ముస్లిముల వ్యక్తిగత ధార్మిక విషయాల్లో కలుగజేసుకుని, ముస్లిమ్ వ్యతిరేక ట్రిపల్ తలాక్, ఎన్ ఆర్ సి, ‘వక్ఫ్ సవరణ-2024’ లాంటి ప్రజాస్వామ్య విరుద్ద నల్ల చట్టాలను రూపిస్తోంది. అయితే బిజెపి ప్రభుత్వం ధార్మిక సంస్థల్లో కుత్రపూరిత జోక్యాన్ని ముస్లిమ్ సమూహం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు సెక్యులర్ వాదులను ఏకంచేసి రాజ్యాంగ బద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ పేరిట హొళగుందలోని అన్ని మసీదుల మౌల్విలు, ముతవల్లీలు, ముస్లిం మైనారిటీ పెద్దలు మరియు యువత పెద్దఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేసారు.