ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత ఫలక్‌నుమా (హైదరాబాద్) జట్టు
1 min readరన్నర్ గా నిలిచిన వైఎఫ్ఏ ఎమ్మిగనూరు జట్టు
బహుమతులను అందజేసిన తహసీల్దార్, టీడీపీ నాయకులు, ఆర్గనైజర్లు
ముగిసిన బీవీ స్మారక ఫుట్‌బాల్ టోర్నమెంట్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్బంగా గత 7 రోజులుగా నిర్వహిస్తున్న మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్రాష్ట్ర ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేతగా ఫలక్‌నుమా (హైదరాబాద్) జట్టు నిలిచింది. ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ వాల్మీకి రామకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఫైనల్ లో వైఎఫ్ఏ ఎమ్మిగనూరు జట్టు వర్సెస్ ఫలక్‌నుమా (హైదరాబాద్) జట్లు తలపడ్డాయి ఇందులో ఫలక్‌నుమా విజయం సాధించింది, రన్నర్ జట్టుగా వైఎఫ్ఏ ఎమ్మిగనూరు జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా కొనసాగింది. ఫలక్‌నుమా (హైదరాబాద్) జట్టు 4-2 పెనాల్టీలో ఎమ్మిగనూరు జట్టుపై విజయం సాధించింది. మొదటి బహుమతి రూ. 150000/- ఫలక్‌నుమా దక్కింది. రెండో బహుమతి రూ.100000/- వైఎఫ్ఏ ఎమ్మిగనూరు జట్టుకు దక్కింది. 3వ బహుమతి రూ. 50000/- గోల్డెన్ హైదరాబాద్ జట్టుకు దక్కింది. 4వ బహుమతి రూ. 25 వేలు చైతన్య ఎఫ్సి జట్టుకు దక్కింది. ఇందులో టోర్నమెంట్ బెస్ట్ ప్లేయర్ గా సమీర్ (హైదరాబాద్), బెస్ట్ టీమ్ గా ఎమ్మిగనూరు బీ-టీం జట్టు, బెస్ట్ గోల్ కీపర్ గా రాము (ఎమ్మిగనూరు), టాప్ స్కోరర్ 8 గోల్స్ కొట్టిన హైదరాబాద్ జట్టుకు చెందిన గణపతి నిలిచాడు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మిగనూరు తహసీల్దార్ శేషఫని, విద్యుత్ డిఈ నాగేంద్రప్రసాద్, హెచ్ఎం కృష్ణమూర్తి, గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వనిజరాని, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు రామదాస్ గౌడ్, మహేంద్ర, భాస్కర్, బందెనవాజ్ ఇషాక్, అమాన్, నరసింహ దామా, శివకుమార్, సలీం తదితరులు వీరందరికీ బహుమతులు క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు శ్రీ నిలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ క్రీడల్లో రాష్ట్ర అంతర్ రాష్ట్రం నుంచి క్రీడాకారులు పాల్గొనడం ఎంత సంతోషకరంగా ఉందన్నారు. ఎమ్మిగనూరులో జరిగిన క్రీడలో రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ జరగవని, ఒక పండుగ వాతావరణంలో క్రీడలు ఏర్పాటు చేయడం, వారిని ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో గెలుపోటములు సమానంగా స్వీకరించి ముందుకు వెళ్లాలని సూచించారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు నాందిగా నిలుస్తుందన్నారు. 7 రోజుల నుండి ఫుట్‌బాల్ బీవీ టోర్నమెంట్ ఆర్గనైజర్లకు వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ సీనియర్ ప్లేయర్, కోచర్ మాబు సాహెబ్, సీనియర్ ఆటగాళ్లు భరత్ అడిషనల్ ఎస్పీ, ఈరన్న, హనీఫ్, నరసింహారాజు, శ్రీనివాసులు, ఉప్పర నాగరాజు, నాగేంద్ర కుమార్, మాజీ బిఎస్ఎఫ్ సత్య, బీవీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు వాల్మీకి రామకృష్ణ నాయుడు, కామర్తి మహేష్, నాగూర్ భాష, ఎన్.బి.కె ఈరన్న, స్టోర్స్ చైర్మన్ గట్టు అల్తాఫ్, మన్సూర్ బాషా, జిలాని బాషా, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.