మాదకద్రవ్యాల నిర్మూలనకై యువత ఉద్యమించాలి
1 min readవైస్ ఛాన్స్లర్ విశ్వనాధ్ కుమార్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మాదకద్రవ్యాలు ,డ్రగ్స్ మత్తుపదార్థాల నిర్మూలనకై యువత ఉద్యమించాలని అలాగే దీనిని ఒక సవాలుగా తీసుకొని యువతే కాకుండా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ విశ్వనాధ్ కుమార్ అన్నారు. జిల్లా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా జే.బి.వి.ఎస్ ధి ప్రిజర్వేర్ సేవ సమితి, డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ విశ్వనాథ్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వాడడం వల్ల యువత తప్పుదారులు పడుతున్నారని, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ విద్యార్థులు, యువకులు చదువును నిర్లక్ష్యం చేస్తూ విద్యను కోల్పోతూన్నారని. విద్యార్థులు, యువకులుఇటువంటి డ్రగ్సు, మత్తు, మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఆనరోగ్యపరమైన సమస్యలకు లోనవుతునారని ఆయన తెలిపారు. మరో అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నూరి పారి మాట్లాడుతూ ముఖ్యంగా చదువుకుంటున్న యువత మాదకద్రవ్యాల గురించి అవగాహన పొంది తమ చుట్టూ ఉన్న ప్రజలకి అవగాహన కల్పించే విధంగా ముందుకెళ్లాలని అలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నట్లయితే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సైక్యారిటిష్ డాక్టర్ షాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ యువత ఈ దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళని అలాంటి యువత సరైన అవగాహన లేక మాదక ద్రవ్యాలకు లోనవుతున్నారని ఈ మధ్యకాలంలో యువత మాదక ద్రవ్యాలకి ఆకర్షితులు అవుతున్నారని తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని యువత చెడు అలవాట్ల కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జే.బి.వి.ఎస్ ధి ప్రిజర్వేర్ సేవ సమితి వ్యవస్థాపకుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అశోక్ మాట్లాడుతూ, డ్రగ్స్ పైన మొదటిగా యువత అవగాహన పొందితే వాళ్లు వారి చుట్టూ ఉన్న పదిమందిని మార్చగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్, యూనివర్సిటీ సిబ్బంది, సంస్థ సభ్యులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆయేషా, సిరి చందన, ప్రవళిక, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.