PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆహార శుద్ది పరిశ్రమకు రాష్ట్రంలో అపార అవకాశాలు.. సీఎం చంద్రబాబు

1 min read

ముఖ్యమంత్రి స‌మీక్షలో పాల్గొన్న రాష్ట్ర‌ మంత్రి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ అమరావతి:  రాష్ట్రంలో ఆహారశుద్ది రంగంపై సిఎం సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు రాష్ట్రంలో అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. సచివాల‌యంలో ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స‌మావేశంలో రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  టి.జి భ‌ర‌త్, రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ ఉత్పత్తుల‌కు…ఆహార శుద్ది పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయని సిఎం అన్నారు. రైతులు తాము పండించే పంటలకు వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా పాలసీ తీసుకురావాలని సిఎం అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని….వాటిని ప్రోత్సహించాలని సిఎం అన్నారు. ఆయా ప్రాంతాల్లో పండే టమాటా, మ్యాంగో, మిరప, పసుపు, ఆక్వా ఉత్పత్తులకు అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. పుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి గ్రామాల్లో ప్రోత్సాహం ఇచ్చే విధంగా విధానాలు తీసుకురావాలని సిఎం అధికారులకు సూచించారు. సమీక్షలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

About Author