పౌష్టిక ఆహారం పట్ల ప్రజల్లో చైతన్యం అవసరం
1 min readపోషకాలతో కూడిన అహారం పై దృష్టి పెట్టాలి
ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక పదార్ధాలు తప్పని సరిగా తీసుకోవాలి
పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం: పౌష్టిక ఆహారం పట్ల ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకు రావాల్సిన బాధ్యత అందరిపై ఉందని,నాణ్యమైన,కల్తీ లేని ఆహారంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడంలో శ్రద్ద తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ల లీలారాణి పిలుపునిచ్చారు.లీ ఫార్మా లిమిటెడ్, లీ హెల్త్ డొమొయిన్ ఇండియా సంస్ధల సంయుక్త అద్వర్యంలో ప్రాజెక్ట్ స్మూత్ వాక్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పిలుపుమేర పోషణ మాఘ్ 2024 సందర్భంగా సంస్థ ప్రతినిధి ఆళ్ళ లీలారాణి నేతృత్వంలోఆంధ్ర యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్ విభాగంలోని సెమినార్ హాల్ లో పోషక ఆహార ఆవశ్యకత కార్యక్రమానికి వక్తలుగా లీ ఫార్మా లిమిటెడ్ సంస్థల డైరెక్టర్ ఆళ్ల లీల రాణి మరియు చర్మ రోగ వైదుడు డి గోపీచంద్ పోషక ఆహార ఆవశ్యకత వాటి అనుగుణ ఆహార అలవాట్లు మరియు పాటించవలసిన నియమాలు,తీసుకోవలసిన జాగ్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా లీలారాణి మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని,మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార విషయంలో శ్రద్ద తీసుకోవడం తప్పని సరి అని తెలిపారు.నేటి అధునిక పరిస్ధితుల్లో నాణ్యమైన,సమయ పాలన లేకుండా ఆహారం నామమాత్రంగా తీసుకుంటున్నారని వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెద్ద ఏత్తున వస్తున్నాయని అవేదన వ్యక్తం చేశారు.ప్రతి వ్యక్తి,తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం క్రమ పద్దతిలో తీసుకోవాలని లీలారాణి పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రా యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగపు ప్రిన్సిపల్ యం వి ఆర్ రాజు పాల్గోని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.