గ్రామంలో భయం భయం.. సాయంత్రమైతే ఒళ్లంతా దద్దుర్లు
1 min readఅధికారులు స్పందించని మండలం..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: సీజనల్ వ్యాధులకు విచిత్ర రోగాలకు అడ్డాగా గడివేముల గ్రామం మారిపోయింది ఇందుకు నిదర్శనమే సాయంత్రమైతే చాలు గ్రామంలో కంటికి కనిపించని దోమలు కరిస్తే ఒళ్లంతా దద్దుర్లు రావడం కొద్దిసేపటికి మళ్లీ యధాత స్థితికి రావడం గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో గ్రామంలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు దర్శనం ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది సాయంత్రం మండల కేంద్రంలోని కార్యాలయం వద్ద వెళ్లాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు కనీసం మూడు నెలలైనా ఇప్పటివరకు ఫాగింగ్ చేయలేదంటే ప్రజలకు ఏమైనా మాకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటువేయాలని గడివేముల గ్రామ ప్రజలు కోరుతున్నారు ఎక్కడ చూసినా పేరుకు మండలం గా వ్యవహరిస్తున్న గడివేముల జిల్లా సరిహద్దు గ్రామంగా నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిపోయింది కనీసం కార్యాలయాల బోర్డులు కూడా మార్చకుండా అలాగే వ్యవహరిస్తున్న అధికారులు వారి పనితనానికి నిదర్శనంగా మారిపోయారు .. ఇప్పటికైనా గ్రామంలో ఉన్న పరిసరాలలో పిచ్చి మొక్కలను తొలగించి గ్రామం మొత్తం ఫాగింగ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.