హిందూ సమాజంలో అంటరానితనానికి తావులేదు…
1 min readవిశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సామాజిక సమరసత , న్యూఢిల్లీ, ప్రముఖ్ దేవ్ జీ రావత్……
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం ఉ. 10:00 గం.ల నుండి సా 6:00 గం.ల వరకు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయము, భరతమాత మందిరం వెనుక, నాగిరెడ్డి రెవెన్యూ కాలని లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సమావేశాల్లో విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సామాజిక సమరసత ప్రముఖ్, న్యూఢిల్లీ మాట్లాడుతూ….హిందూ సమాజంలో అంటరానితనానికి తావులేదని 200 సం. భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటీష్ వారు భారతదేశ ఏకత్వాన్ని, సంఘటిత తత్వాన్ని నాశనం చేయడం కోసం హిందూ సమాజంలో చీలికలు తేవడం కోసం దళితులను అంటరాని వారిగా చిత్రించి సమాజం నుండి విడగొట్ఠిందని ఆ సాంఘీక దురాచారాన్ని ఇప్పుడు హిందూ సమాజం వెలి వేసిందని చాలా వరకు ఈ అంటరానితనం రూపుమాపబడిందని కానీ ఇంకా గ్రామ స్థాయిలో ఈ సాంఘీక దురాచారం ఉందని దానిని పూర్తిగా రూపుమాపడం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని హితవుపలికారు, ఎప్పుడైతే హిందూ సమాజంలో అన్ని కులాలు ఎటువంటి తారతమ్యం లేకుండా సంఘటితమౌతాయో అప్పుడే హిందూ సమాజం బలపడుతుందని తెలియజేశారు.భారతీయ గొప్ప ఇతిహాసమైన”శ్రీమద్రామాయణం” నేటి హిందూ సమాజానికి, విద్యార్థినీ, విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో సుమారు వెయ్యి ప్రయివేటు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో ఒక ఆచార్యుల ద్వారా నవంబర్,డిశంబర్ల లో శిక్షణ ఇచ్చి అయోధ్యలో భవ్య రామమందిరం మహా ప్రతిష్టా కార్యక్రమం జరిగినా రోజున పరిక్షలకు నిర్వహించి జనవరి 26 వ తేదీన భారత గణతంత్ర దినోత్సవం రోజున బహుమతి మరియు ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ మొత్తం కార్యక్రమానికి కన్వీనర్ గా రాష్ట్ర సహకోషాధికారి గూడా సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తారని రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు తెలిరజశారు. ఈకార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి సభాధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ భాగ్య నగర్ క్షేత్ర సంఘటనా కార్యదర్శి గుమ్మళ్ళ సత్యం జీ, విధి ప్రముఖ్ సూర్యప్రకాష్ ,సహకార్యదర్శి ప్రాణేష్, కోషాధికారి సందడి మహేశ్వర్,సహ కోశాధికారి గూడా సుబ్రహ్మణ్యం, మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి గౌరి, మందిర ఏవం అర్చక పురోహిత ప్రముఖ్ శివశంకర్ , సామాజిక సమరసత ప్రముఖ్ చింతపర్తి మహేష్,విశేష సంపర్కప్రముఖ్ ప్రతాప్ రెడ్డి , సత్సంఘ ప్రముఖ్ సోమా సుబ్బారావు, సేవా ప్రముఖ్ రామ్మూర్తి, బజరంగ్ దళ్ కో కన్వీనర్ రవి, గో రక్షా కన్వీనర్ బ్రహ్మనందరెడ్ఢి, 16 జిల్లాల కార్యదర్శులు, సహకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.