కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు ఏమి లేవు
1 min readఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు.
ఎలాంటి తవ్వకాలు జరగడం లేదు.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
కర్నూలు జిల్లా ఎస్పీ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేవనకొండ మండలం , కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలలో యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోరు తవ్వకాలు జరగడం లేదని గౌరవనీయులైన కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ రోజు తెలియజేశారని, కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి . బిందు మాధవ్ ఐపీఎస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గమనించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని జిల్లా ఎస్పీ కోరారు. ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.ఎవరైనా ఈ విషయాన్ని అనవసరంగా ప్రజలను భయాందోళనకు గురిచేసే వారిపై, సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.