విద్యార్థులు సాధించలేనిది ఏది లేదు..
1 min readనవనంది పాఠశాలలో బాలల దినోత్సవం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విద్యార్థులు అనుకుంటే సాధించలేనిది ఏదియు లేదని శ్రీ నవనంది పాఠశాల కరస్పాండెంట్ బద్దుల శ్రీధర్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది పాఠశాలలో బుధవారం ఉదయం పాఠశాల కరస్పాండెంట్ బి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముందుగా చాచా నెహ్రూ చిత్రపటానికి కరస్పాండెంట్ శ్రీధర్ మరియు బి మీనాక్షి,విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్ రెడ్డి చాచా నెహ్రూ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీచర్లు చెప్పిన విధంగా మంచిగా చదువుకొని ముందుకు వెళ్లాలని ఒక లక్ష్యంతో మీరు చదివినట్లయితే అనుకున్న గమ్యాన్ని మీరు చేరుతారని అప్పుడే మీరు ఒక స్థాయిలో నిలబడతారు తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు వస్తుందని పాఠశాల చైర్మన్ శ్రీధర్ అన్నారు.విద్యతో పాటు ఆటల పోటీల్లో కూడా ముందంజలో ఉండాలని వ్యాయామ ఉపాధ్యాయులు శివ శంకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను వారు ప్రధానం చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసప్ప,పీఈటీ సుబ్బన్న, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.