చైర్మన్..కౌన్సిలర్ మధ్య తోపులాట ఉద్రిక్తత
1 min readభగ్గుమంటున్న వర్గ విభేదాలు
కమిషనర్ పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా:మున్సిపల్ చైర్మన్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. బుధవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో 155 వ జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు అర్పించేందుకు ఉ 8:30 కు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు కౌన్సిలర్లు మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ హాజరయ్యారు.మున్సిపాలిటీలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసే సమయంలో ఎమ్మెల్యే తో పాటుగా మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మరియు 2 వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఉన్నారు.వీరిద్దరిలో ఒకరు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేశారు నీవు పూల దండ వేసావు కదా పక్కకు జరుగు అని అనడంతో ఇక్కడే మొదలైంది సమస్య..చైర్మన్ కౌన్సిలర్ మధ్య మాటల యుద్ధం వారి మధ్య తోపులాట ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.రూరల్ సీఐ టి.సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్లి సమస్య చక్కబడేలా చేశారు. ఎమ్మెల్యే మరియు వారి కౌన్సిలర్లు..కమిషనర్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పూలమాలలు వేసి మున్సిపాలిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మధ్యలోనే దిగి తమ ఛాంబర్ లోకి వెళ్లిపోయారు.తర్వాత చైర్మన్ సుధాకర్ రెడ్డి కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మున్సిపాలిటీ కమిషనర్ పై చైర్మన్ భగ్గుమన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ కమిషనర్ నేను చైర్మన్ గా ఉన్న నన్ను పిలవకుండానే గాంధీజీ విగ్రహానికి వాళ్ళే నివాళులు అర్పించడం బాధగా ఉందని కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆమె వ్యవహరిస్తున్నారని అన్నారు. త్వరలోనే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు చైర్మన్ అన్నారు.ఇక్కడ ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా రూరల్ సీఐ ముందుగానే సిబ్బందిని ఏర్పాటు చేశారు.