ఈవిఎం గోడౌన్ వద్ద నిరంతర పటిష్ట భధ్రత ఉండాలి
1 min readఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జిల్లాకు సంబంధించి ఈవిఎంలను భధ్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భధ్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఏలూరు కలెక్టరేట్ లో ఉన్న ఈవిఎం గోడౌన్ ను గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ లో భధ్రపరచిన్ ఈవిఎం యంత్రాలు బి.యు లు, సియు లు, వివిప్యాట్ లను, అక్కడి భధ్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షుణంగా పరిశీలన చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఎస్.భరత్ రావు(బిఎస్పి), అచ్యుత్(టిడిపి), నెరుసు నెలరాజు(బిజెపి), కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.