PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మంచినీరు నిల్వలు ఉండాలి

1 min read

కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు

ఎమ్మెల్యే చంటి,మేయర్ నూర్జహాన్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ బృందంతో కలిసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిశీలన

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు నగర ప్రజలకు 40 రోజులకు సరిపడా మంచినీరు నిల్వ ఉందని రానున్న వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలని లేని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు నగర ప్రజలను కోరారు. రానున్న వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు,రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తెలియజేశారు అన్నారు. ముందస్తుగా ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలను దృష్టిలో పెట్టుకొని ఏలూరు శాసనసభ్యులు  బడేటి రాధాకృష్ణయ్య (చంటి),నగరపాలక సంస్థ మేయర్  షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాల మేరకు.నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు బుధవారం ఉదయం మున్సిపల్,అధికారులు కార్పొరేటర్ల బృందంతో కలిసి దెందులూరు లో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు చూసి సుమారు 40 రోజుల వరకు సరిపడా గోదావరి జలాలు ట్యాంకులో ఉన్నాయనిఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు. గోదావరి జలాలను పంపింగ్ చేసే 150 హెచ్పి మోటర్ ఎక్కువగా రిపేర్లు రావడం కారణంగా గోదావరి జలాలను చెరువులోకి పూర్తిస్థాయిలో పంపింగ్ చేయలేకపోతున్నామన్నారు.అయితే ఆమోటార్ స్థానంలో తక్షణమే 50 హెచ్ పి మోటార్లను బిగించి గోదావరి జలాలను పంపించేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం చెరువులో ఈ రోజుల్లో 16 మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉండేవని ఇప్పుడు అవి 13 మీటర్ల లోతు ఉన్నాయన్నారు.అందువలన రానున్న వేసవి కాలంల్లో నీటికి ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఇప్పటినుంచే మంచినీటి వాడకాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని పెదబాబు అన్నారు. కుళాయిల ద్వారా నీటిని వృధా చేయకుండా టాప్ లు బిగించుకోవాలని పెదబాబు నగర ప్రజలను కోరారు.ఫిబ్రవరి నెల వరకు గోదావరి జలాలు వస్తాయన్నారు. అయితే గోదావరి జలాలు మన వరకు రాకుండగా మధ్యలో రైతులు పంటపొలాలకోసం అడ్డుకట్టలువేసి నీటిని ప్రక్కకు  తరలించడం ద్వారా వేసవికాలం మంచినీటి కోసం మనం తీవ్రంగా ఇబ్బంది పడతామని అధికారులు అంచనా వేయడంతో నగర ప్రజలకు ముందస్తుగా తెలియజేయడం జరుగుతుందని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎం.ఈ సురేంద్రబాబు,డి.ఈ లు రజాక్, తాతబ్బాయి,ఎలక్ట్రికల్ ఏ.ఈ సాంబశివరావు, కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు,బత్తిన విజయకుమార్,దేవరకొండ శ్రీనివాసరావు,పాము శామ్యూల్, నున్న కిషోర్, ఈదుపల్లి పవన్,చలువాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *