వెంటపడుతున్నాయి.. మండలంలో పెరిగిపోయిన శునకాల సంతతి ..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేము: వర్షాకాలంలో అసలే బయటికి వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు ఆపై గ్రామాలలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న గ్రామ సింహాలు ద్విచక్ర వాహనదారుల వెంటపడుతున్నాయి. ముఖ్యంగా గడిగరేవుల చిందుకూరు గ్రామ శివారులలో కుక్కలు వెంటపడి కింద పడడం నిత్య కృత్యమైంది ఎవరైనా కనిపిస్తే చాలు పిక్కలు పీకేస్తున్నాయి గ్రామంలో ఎక్కడ చేసిన గుంపులు గుంపులుగా వీధుల్లో తిరుగుతూ చిన్నారుల వెంట పడడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ద్విచక్ర వాహనాల కోరుతున్నారు.