సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచి సంపంద సృష్టిస్తున్నారు..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి బాబు కరెంట్ చార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారు.తాజాగా 9 వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపిఇంట్లో కరెంటు స్వీచ్ వేయాలంటే భయమేస్తోందికూటమి ప్రభుత్వం ఒక్క యూనిట్ కు 2.19 రూపాయలు విద్యుత్ చార్జీలు పెంచబోతున్నారు. బాబు 75 వేల కోట్ల రూపాయలను అప్పు చేసి ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నాము.ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా విద్యుత్ చార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం వేశారు.సెకి పేరుతో విద్యుత్ ఒప్పందంలో ఏదో జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఎల్లో మీడియా, టిడిపి పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయు తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదిరింది.దిని పై ఎల్లో మీడియా, టిడిపి పార్టీ నేతలు అసత్య ఆరోపణలు ప్రచారాలు చేయించారు. కేంద్ర ప్రభుత్వం తో ఒప్పందం ద్వారా నే రాష్ట్రానికి విద్యుత్ సరఫరా అయింది.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలు అమలు చేశారు.రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విద్యార్థులకు అమ్మ ఒడి, ఫిజు రియింబర్స్మెంట్ అందించడం లేదు.చంద్రబాబు ఇచ్చిన హామీలు తో మహిళలు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లకు చుట్టు తిరుగుతున్నారు.నిరుద్యోగులకు చంద్రబాబు హయాంలో ఏమి చేయడం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు.బాబు ను చూసుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అనుసరిస్తున్నారు.ఎల్లో మీడియా పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టు ను ఆశ్రయించారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీజాయితి పురుడు కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.ఎన్నికల ముందు ఇచ్చిన బాబు హామిలను అమలు చేయాలి, ప్రజలపై విద్యుత్ చార్జీలను ఉపసంహరణ చేసుకోవాలి.నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే చర్యలు చేపట్టాలి, ప్రజలను డైవర్ట్ చేసేందుకు రాష్ట్రంలో ఏదో విషయం పై విషప్రచారం చేస్తున్నారు.