PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రాహ్మణులను మోసపుచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం నాడు కర్నూలు నగరం లో గల టీడీపి ప్రధాన కార్యాలయం నందు  కర్నూలు బ్రాహ్మణ నాయకులు  సమావేశమై , నిన్న   వైఎస్ఆర్సీపీ పార్టీ కీ చెందిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు,మరియు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి  వారి పార్టీ తరపున ప్రచారం చేసుకొని చివరికి ప్రెస్మీట్ పెట్టి ఒకరి మించి ఒకరు ఆపద్దాల పరంపర సాగించారు కావున వీరి పత్రికా ప్రకటనలు ఖండిస్తున్నాం, ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ను శ్రీ నారాచంద్రబాబు నాయుడు  స్థాపించారు ఇది జగమెరిగిన సత్యం దానిని కూడా మాయచేసి జగన్ మోహన్ రెడ్డి  బ్రాహ్మణ కార్పొరేషన్ స్తాపించారు అని చెప్పి పచ్చి ఆ అబద్దాలు ఆడారు ,బ్రాహ్మణులను మోసపుచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తే బ్రాహ్మణులు అమాయకులు కాదు మీకు కర్నూలు బ్రాహ్మణులు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలని ఏనాడో నిర్ణయం తీసుకున్నారు 90% మేరా తెలుగు దేశం సైకిల్ గుర్తు పై ఓట్లు వేస్తారు, ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లో బ్రాహ్మణుల పై దాడులు దేవాలయాలపై దాడులు చూసి విసిగి వేసారి పోయారు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,పెన్షన్ దారులు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కావున అద్ర ప్రదేశ్ రాష్ట్రములోని బ్రాహ్మణులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి అసెంబ్లీ కీ 175/160సీట్లు గెలిపించాలని కోరారు అలాగే పార్లమెంట్ కు 25/25 గెలిపించి విజయం చేకూర్చి పెట్టడమే మన బ్రాహ్మణ లక్షం, తెలుగుదేశం,బీజేపీ, జనసేనా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యాబలం మనకు వుంది, అని చాటాలి ,అని కోరారు ఈ కార్యక్రమములో   సముద్రాల శ్రీధర్ బాబు రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కమిటీ సభ్యుడు, టివి రవిచంద్ర శర్మ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ బ్రాహ్మణ సాధికార సమితి సభ్యుడు, డావనగేరి ఆనందరావు టీడీపి పార్టీ  అసెంబ్లీ కమిటీ సభ్యుడు, శ్రీసండేల్ చంద్రశేఖర్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి కర్నూలు,  శ్రీ రామరాజు  APBSS   రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి మారుతి శర్మ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు  పాల్గొన్నారు .             జై బ్రాహ్మణ జైజై బ్రాహ్మణ.             జై తెలుగు దేశం జైజై తెలుగుదేశం.

About Author