PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ఆదివారం సాయంత్రం జి తెలుగులో హనుమాన్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జి తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ హనుమాన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అందిస్తోంది జీ తెలుగు ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన హనుమాన్ ‘ చిత్రాన్ని ఆస్వాదించడానికి మీరూ సిద్ధంగా ఉండండి. బుల్లితెరపై ‘హనుమాన్’ ఆగమనం ఈ ఆదివారం (ఏప్రిల్ 28) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఆకట్టుకునే కథ, యాక్షన్ సిక్వెన్స్, హనుమంతు, మీనాక్షి (అమృతా అయ్యర్)ల ప్రేమ వంటి అంశాలతో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులను ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేస్తుందనడంలో సందేహం లేదు. ప్రేమ, ధైర్యం, దైవత్వంతో ముడిపడి ఉండే హనుమాన్ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.ఈ వారాంతాన్ని మరింత స్పెషల్ చేసేందుకు సూపర్ హిట్ సినిమా హనుమాన్తో పాటు మరిన్ని సర్ప్రైజ్లను అందిస్తోంది జీ తెలుగు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫీ కాంటెస్ట్లో పాల్గొని కళ్లుచెదిరే కిచెన్ ఐటెమ్స్్స్న బహుమతులుగా పొందవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. మీ పిల్లలకి ఇష్టమైన సూపర్హీరో గెటప్ వేసి వారితో ఒక సెల్ఫీ తీసుకుని 9966034441 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి, లేదంటే టీవీ స్క్రీన్పైన కనిపించే QR కోడ్ని స్కాన్ చేసి కూడా సెల్ఫీని అప్లోడ్ చేయవచ్చు. విజేతల వివరాలను హనుమాన్ సినిమా ప్రసార సమయంలో ప్రకటిస్తారు. అంతేకాదు హనుమాన్ జిగ్సా ఫజిల్ గేమ్ ని zeeteluguhanuman.zee5.com కి లాగిన్ అయి ఇచ్చిన టైమ లోగా లెవల్స్ను పూర్తి చేస్తూ స్కోర్ బోర్డు లో లీడర్ గా నిలవండి ఇంకెందుకు ఆలస్యం వెంటన్ గేమ్ ఆడేయండి!

About Author