ఈ విజయం ప్రజలది..ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
1 min readరాంపురం లో జన జాతర
ఎమ్మెల్యే ను కలిసేందుకు పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ఈ విజయం నాది కాదని నా నియోజకవర్గ ప్రజలదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాంపురం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం దగ్గర జన జాతరను తలపించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు లో నాలుగవ సారి ఘన విజయం సాధించిన వై. బాలనాగిరెడ్డి మంత్రాలయం నియోజకవర్గానికి 4వ ఎమ్మెల్యే గా 12843 ఓట్ల మెజార్టీతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి పై విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ని ఆయన తనయుడు వైకాపా యువ నాయకులు వై. ధరణీ రెడ్డి ని కలిసేందుకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు రాంపురం గ్రామానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. వై. బాలనాగిరెడ్డి ని, వై. ధరణీ రెడ్డి ని వేర్వేరుగా కలిసి పూలమాల వేసి శాలువ కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ఇది నా విజయం కాదు నా నియోజకవర్గ ప్రజల విజయం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా టిడిపి అభ్యర్థులు విజయం సాధిస్తుంటే ఇక్కడ మాత్రం నా మీద నమ్మకంతో అభిమానం తో భారీ మెజార్టీతో గెలిపించారని వారి కి జీవితాంతం రుణ పడి ఉంటానని అన్నారు. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రజలకు, నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నానని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తెలిపారు.