శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో తితిదే కార్యక్రమాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుండి శుక్రవారం వరకు పత్తికొండలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి రోజు సాయంత్రం 6-00 గంటల నుండి 8-00 గంటల వరకు మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ప్రముఖ నాటక రంగ కళాకారులు పాయసం పెద్ద రంగారెడ్డిచే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబందించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అమరావతి శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ పత్తికొండ ప్రఖండ అద్యక్షులు వీరరాజు, ఆర్.ఎస్.ఎస్. ప్రముఖ్ రామలింగయ్య, ప్రముఖ నాటక రంగ కళాకారులు పాయసం పెద్ద రంగారెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు కోదండరాం తదితరులు పాల్గొన్నారు.