పెంచికలపల్లిలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
భారతీయ కాలమానం ప్రకారం ప్రతి మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతీయ కాలమానం ప్రకారం ప్రతి మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉన్నదని, అందుకే ఆయా మాసాలలో ఆయా నియమాలు, వ్రతాలు, వివిధ రకాల ఆచారాలు ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, పాములపాడు మండలం, పెంచికలపల్లి గ్రామంలో వెలసిన శివాలయం నందు నాలుగు రోజుల ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్బంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. వనభోజనాలు సామాజిక అస్పృశ్యతను తొలగించి సామాజిక సమరసతను కలిగిస్తాయని అన్నారు. మన భారతీయ ఆచారవ్యవహారాలలో ప్రతి ఆచారం వెనుక శాస్త్రీయ విజ్ఞానం ఉన్నదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు ధార్మిక ప్రవచకులు ఆమంచి వేంకటేశ్వర శర్మ మాట్లాడుతూ సమాజంలో ధార్మిక నిష్ఠ ఏర్పడినప్పుడే ఆత్మశక్తి పెరుగుతుందని అన్నారు. అందుకు శ్రీమద్రామాయణం లోని వివిధ సంఘటనలను సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు బి. నాగలింగమయ్య, అర్చకులు ఎస్. మౌళాలి గౌడ్, కె.నారాయణ గౌడ్, యం నారాయణ, జి. నాగలింగమయ్య గౌడ్, యం. రాజేశ్వరరావు, యం. నాగరాజుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.