పార్టీకి విధేయులుగా పనిచేసిన వారికెప్పుడు తగిన గుర్తింపు లభిస్తుంది
1 min readఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా
చోడే వెంకటరత్నం,జాల సుమతి బాలాజీ,కొల్లేపల్లి రాజు ఎంపిక
కష్టకాలంలో కొండంత అండగా నిలబడి పార్టీ విజయానికి కృషి చేశారు
అదనపు కమిషనర్ జి చంద్రయ్యకు నామినేషన్ పత్రాలు అందజేత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పార్టీకి విధేయులుగా పని చేసిన వారికెప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి సేవలందించడంతో పాటూ కష్టకాలంలో పార్టీకి కొండంత అండగా నిలబడి పార్టీ విజయానికి కృషి చేశారని మాజీ డిప్యూటి మేయర్ చోడే వెంకటరత్నం, మాజీ కౌన్సిలర్, టిడిపి మాజీ పట్టణాధ్యక్షులు కొల్లేపల్లి రాజు, మాజీ కార్పొరేటర్ జాలా సుమతి బాలాజీ లను కార్పొరేషన్ పాలక మండలి కో – ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసినట్లు మీడియా సమావేశంలో సోమవారం ఎమ్మెల్యే ప్రకటించారు. రానున్న రోజుల్లో నగరాభివృద్ధిలో వీరు కూడా భాగస్వాములవుతారని బడేటి చంటి పేర్కొన్నారు. అనంతరం చోడే వెంకటరత్నం, కొల్లేపల్లి రాజు, జాలా సుమతిలు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్యకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటి మేయర్ చోడే వెంకటరత్నం,కో – ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకు అనుభవజ్ఞులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సముచిత స్థానం కల్పించి కో- ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. నగరాభివృద్ధిలో కార్పొరేషన్ పాలకవర్గం సమైక్యంగా ముందడుగు వేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పెద్దిబోయిన శివప్రసాద్, చోడే బాలు, నాయకులు నెరుసు గంగరాజు, జంపా సూర్యనారాయణ,మారం అను, జాలా సుమతి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.