చెన్నూరు మండల పరిధిలో మూడు నీటి సంఘాలు ఏకగ్రీవం
1 min readచెన్నూరు నీటి సంఘం చైర్మన్ గా గోదినా శ్రీనివాసులు
చిన్న మాసుపల్లి చైర్మన్ శంకర్ రెడ్డి
అల్లం ఖాన్ పల్లి నేటి సంఘం చైర్మన్ తాడిగొట్ల వెంకట సుబ్బారెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలం పరిధిలో కేసీ కెనాల్ ఆయకట్టు సాగునీటి రైతులకు సంబంధించి మూడు నీటి సంఘాల ఎన్నికలు చైర్మన్గా వైస్ చైర్మన్లు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి సంఘాలకు ఎన్నికల నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం మండల రెవిన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు నిర్వహించిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు ఎన్నికల సంఘాలను కైవసం చేసుకుంది. అల్లం ఖాన్ పల్లి నీటి సంఘం చైర్మన్గా తాడిగొట్ల వెంకటసుబ్బారెడ్డి( బుజ్జన్న ) వైస్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి. చెన్నూరు కేసీ కెనాల్ చైర్మన్గా గోదినా శ్రీనివాసులు. వైస్ చైర్మన్ గా ముండ్ల నరేంద్ర నాథ్ రెడ్డి. చిన్న మాసిపల్లి నీటి సంఘం చైర్మన్గా ఉప్పరపల్లి శంకర్ రెడ్డి వైస్ చైర్మన్ గా చెన్నూరు కు చెందిన ముని సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు నీటి సంఘాలు ఏకగ్రీవంగా కృషి చేసినందుకు చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకుడు పొట్టి పాటి రానా ప్రతాప్ రెడ్డి. మల్లికార్జున్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి. దేశం పార్టీ నాయకులు ముళ్ళ శ్రీనివాసులు రెడ్డి. షేక్ ముక్తియార్. షేక్ మొహమ్మద్ లు కలసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు. పుత్త నరసింహారెడ్డి. కమలాపురం శాసనసభ్యులు. పుత్త కృష్ణ చైతన్య రెడ్డి. కమలాపురం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పుత్త లక్ష్మి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారిని పార్టీ కార్యాలయం కలిసి శాలువా కప్పి అభినందించారు.