బక్రీద్ పండుగ కు పటిష్ట భద్రత ….
1 min readఏర్పాట్లను పర్యవేక్షించిన… కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపీఎస్
ముస్లిం సోదరులకు, పోలీసు సిబ్బందికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెల్పిన జిల్లా ఎస్పీ.
హిందూ, ముస్లిం సోదరులు కలిసి మెలసి పండుగలు జరుపుకోవాలి…. ప్రజలు పోలీసులకు సహకరించాలి.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా , ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి.
చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రేపు బక్రీద్ పండుగ అందరి జీవితాల్లోఆనందోత్సాహాలు నింపాలని, అల్లాహ్ అందరిని ఆశ్వీరదించాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్ ముస్లిం సోదరులకు , పోలీసు సిబ్బందికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఆదివారం కర్నూల్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు.అనంతరం కర్నూల్ పట్టణ శివారు లలోని జోహరాపురం, పూల బజారు, గుత్తి పెట్రోల్ బంకు , సంతోష్ నగర్ హైవే దగ్గర ఉన్న కొత్త ఈద్గా, పంచలింగా ల చెక్ పోస్టు ల వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ గారు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. బక్రీద్ పండుగ సంధర్బంగా ట్రాఫిక్ మళ్ళింపు, పోలీసు బందోబస్తు ఏర్పాట్ల గురించి పోలీసు అధికారులకు పలు సూచనలు , సలహాలు తెలియజేశారు. కర్నూల్ జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని, జూన్ 17వ తేదీ సోమవారం బక్రీద్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాము. ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలి. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వారి పై నిఘా ఉంచాము.పోలీసు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశాము.బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. కర్నూల్ పట్టణంలో పోలీస్ పికెట్లు ,మొబైల్ పార్టీలను బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు.పుకార్లు, వదంతులను నమ్మకూడదని , సమస్యలుంటే డయల్ 100 కి గాని, స్ధానిక పోలీసులకు గాని, ప్రజలు తెలియజేయాలి.జిల్లా ఎస్పీ వెంట కర్నూల్ డిఎస్పి విజయ శేఖర్ , సిఐలు నాగరాజ్ యాదవ్ ,ప్రసాద్ ,పవన్ కుమార్ ,శంకరయ్య, ట్రాఫిక్ సిఐ గౌతమి, ఎస్సై ఖాజావలి ఉన్నారు.