దాత దురుసు ప్రవర్తనతో విసిగిపోయాం…!
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: దాత దురుసు ప్రవర్తనతో విసిగిపోయామని మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాని శుక్రవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా జరిగిన పూజ కార్యక్రమంలో భాగంగా కూరగాయల దాత నంద్యాలకు చెందిన మార్కెట్ ప్రసాద్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని ఈ సందర్భంలో తనను అగౌరవపరిచారని దేవాదాయ కమిషనర్ కు తమపై ఫిర్యాదు చేసినట్లు రవి శంకర్ అవదానికి తెలిపారు. దీంతోపాటు మహానంది క్షేత్రంలో జరిగే నిత్య ప్రసాద అన్న వితరణ కార్యక్రమానికి కూరగాయలు సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారని తెలిపారు. కానీ వాస్తవంగా ఆరోజు జరిగిన పరిస్థితులను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నానని వేద పండితులలో ఒకరిని క్షేత్రంలోని ప్రధాన ఆలయంలో దాత అవమానించారని కానీ దాతపై గౌరవంతో తాము బయటికి చెప్పలేకపోయాం అన్నారు. మహానది క్షేత్రానికి ఆ దాత ఎంతో సేవ చేశారని దానిని మర్చిపోలేము అని కానీ ఆ దాత తమపై ప్రవర్తించిన తీరు బాగా లేదన్నారు. తమపై మరియు కార్య నిర్వహణ అధికారిపై కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో తాము ఈ విషయం బయటికి వెల్లడించాల్సి వచ్చింది అన్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించగా దాత పై గౌరవంతో వెల్లడించలేదని తమపై ఫిర్యాదు చేయడంతో మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి కూరగాయలు అందించడానికి కొంతమంది ముందుకు వచ్చారని ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్తీక పౌర్ణమి ముగిసి వారం రోజుల తర్వాత మీడియా సమావేశం పెట్టి దాత పై ఆరోపణలు చేయడం సబబేనాని ప్రశ్నించగా మాపై ఫిర్యాదు చేశారు కాబట్టి మేము మీడియా ముందు వెల్లడించాల్సి వచ్చిందని అధికారులు మరియు అవధానులు వెల్లడించడం చర్చనీయంశంగా మారింది.