తిరుమల ఘటన బాధాకరం…
1 min readతీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: తిరుమల తిరుపతి లో జరిగిన తొక్కిసలాట లో ఆరుగురు భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని టోకెన్లు తీసుకునేలోపే ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద ఘటన పట్ల బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ 25 లక్షల పరిహారం ప్రకటించడం జరిగిందన్నారు.ఈ ఘటనకు సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ని వేడుకున్నట్లు తెలిపారు.