తిరుపతి ఘటన బాధాకరం..
1 min readఘటనపై న్యాయ విచారణ జరిపించాలి..
ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ..
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : తిరుపతి ఘటన అత్యంత బాధాకరమని ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ అన్నారు. ఆలూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల చేస్తూ వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, జరిగిన ఘటన పై న్యాయ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు ఆలూరు కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారి విషాద సంఘటన అని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఈ ఘటనకు కారణం కావచ్చని మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాలని చిప్పగిరి లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమనీ ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని, వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.