PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొగాకు… ప్రాణాంతకం…

1 min read

పొగాకు బానిసై.. ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

  • ప్రముఖ సైకియాట్రిస్ట్​ డా. బి. రమేష్​ బాబు
  • మే 31న ప్రపంచ వ్యతిరేక దినోత్సవం

కర్నూలు, పల్లెవెలుగు: పొగాకు లేదా  నికోటిన్ స్మోకింగ్ (ధూమపానము)కు బానిసై.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.5 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయమన్నారు మానస హాస్పిటల్​ అధినేత, ప్రముఖ సైకియాట్రిస్ట్​ డా.రమేష్​ బాబు. శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా.. నగరంలోని పుల్లారెడ్డి దంత వైద్యశాల విద్యార్థులకు పొగాకు పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. బి రమేష్​ బాబు మాట్లాడుతూ  ఈ ఏడాది థీమ్​.. ‘ పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం…’ అని WHO నిర్ధారించిందన్నారు. అందుకే దంతవైద్యశాలలోని మెడికల్​ విద్యార్థులకు పొగాకు వ్యతిరేక దినంపై  వివరించారు.   ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.4 బిలియన్ల మంది ప్రజలు  పొగాకును వివిధ రూపాలలో వాడుచూ దీనికి బానిసలవుతున్నారని డా.బి.రమేష్ బాబు తెలిపారు. మరియు వీరిలో 1.5 మిలియన్ల మంది వ్యక్తులు పొగాకు ప్రమాదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ మరణిస్తున్నారు. భారతదేశంలో మొత్తం జనాభాలో దాదాపు 35% మంది పొగాకును ఉపయోగిస్తున్నారు. ఊపిరితిత్తులు, నాలుక, జీర్నాసయము, మూత్రాశయం, ప్యాంక్రియాస్, ల్యుకేమియా వంటి రక్త క్యాన్సర్లు మొదలైన వివిధ శారీరక హానిని కలిగించే పొగాకు చాలా హానికరం, శ్వాసకోశ ఆస్తమా, అతి తీవ్రమయిన COPD, క్షయ వంటి శ్వాసకోశ వ్యాధులు, MI (గుండెపోటులు) వంటి గుండె జబ్బులు, గుండె సంబంధిత మరణాలు, పక్షవాతం వంటి సెరెబ్రోవాస్కులర్ (మెదడుకు సంబంధిత) వ్యాధులు మొదలైనవి కూడా ఈ ధూమపాన వ్యసనము ద్వారా వచ్చేప్రమాదమున్దని డాక్టరు గారు వివరిన్చారు. భారతదేశంలో ఘుట్కా, పాన్, జర్దా వంటి  పొగాకు ఎక్కువగా సేవిన్చటము మూలముగా నోటి క్యాన్సర్‌లకు దారి తీస్తుంది.  పిల్లలు, యువత, మహిళలు కూడా ధూమపాన ప్రకటనలకు ఆకర్షితులై ఈ పొగాకు వ్యసనానికి గురవుతున్నారు.  పొగాకులో 7000 హానికరమైన టాక్సిన్స్ ఉన్నాయి మరియు వాటిలో  దాదాపు 700 క్యాన్సర్ కారకాలు వున్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నవని, వాటిలో కొన్ని హైడ్రోకార్బన్లు, అమ్మోనియా, సల్ఫర్ సమ్మేళనాలు, నైట్రోసమైన్లు మొదలైనవి. పాఠశాల కరస్పాండెంట్లు  పొగాకు మరియు ఇతర ప్రమాదమైన పథార్థములను  విక్రయించడము లేదా సంస్థ సమ్మేళనం యొక్క పరిసరాల్లో 100 యార్డులలో పొగాకు ఉత్పత్తుల ప్రకటన బోర్డులను నిషేధించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సైకియాట్రిస్ట్​ డా. రమేష్​ బాబు కోరారు. ప్రస్తుతం కౌన్సిలింగ్, నికోటిన్ రీప్లేస్మెంట్ గమ్లు, లోజెనెజిసు, నాసల్ స్ప్రే, నోటి ఇన్హేలర్లు, నాన్ నికోటిన్ డ్రగ్స్ వంటి ప్రభావవంతమైన చికిత్స పద్ధతులు ఫార్మా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రజలు పొగాకు వ్యసనం నుంచి విముక్తి పొందాలని మానస హాస్పిటల్​ అధినేత, ప్రముఖ సైకియాట్రిస్ట్​ డాక్టర్ రమేష్ బాబు  కోరారు. అనంతరం పుల్లారెడ్డి డెంటల్​ కళాశాల ప్రిన్సిపల్​ మురళీధర్​, ప్రొఫెసర్లు డా.రమేష్​బాబును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో  మెడికల్​ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author