పొగాకు షెడ్లు కు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు
1 min readపై బోగుల గ్రామంలో పొగాకు షెడ్లు కు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ..!!!
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలం పై బోగుల గ్రామంలో నిన్న రాత్రి సమయంలో వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, సూరి ఈ ముగ్గురికి సంబంధించిన పొగాకు పంట (7 పొగాకు షెడ్లు)ను నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బూడిద అయ్యిన పొగాకు షెడ్లు దాదాపు 12 లక్షలు విలువ చేసే పంట బూడిది అయ్యింది. చేతికి వచ్చిన పంట 2,3 రోజుల్లో అమ్ముకొనే పంట అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి నష్టపోయిన రైతులను పరామర్శించి. పోలీసు వారిని కోరుతున్నది ఒక్కటే నిప్పంటించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు నిప్పు అంటించిన వారితోనే నష్టపరిహారం చెల్లించేలా చూడాలని పోలీసువారికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో గడివేముల మండల నాయకులు పైబొగుల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.