నేడు డయేరియా…. మలేరియా నివారణకై ప్రజలలో అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల లో నేడు డయేరియా మరియు మలేరియా నివారణకై ప్రజలలో అవగాహన కలిగించారు. ప్రిన్సిపల్ శ్రీమతి జ్యోతి ర అధ్యక్షతన నిర్వహింపబడిన ఈ అవగాహన ర్యాలీలో బీసీడీఈ (బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రు ఎడ్యుకేషన్ )కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కృష్ణానగర్ మరియు అబ్బాస్ నగర్ పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు డెంగ్యూ పైన అవగాహన కలిగించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్ట్రిక్ట్ మాస్ మీడియా ఆఫీసర్ సి. శ్రీనివాసులు , శ్రీ చంద్రశేఖర రావు , అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి , డిప్యూటీ డి ఈ ఎం ఓ డాక్టర్ ఫర్షీమ్ తపస్సు ,మెడికల్ ఆఫీసర్ శ్రీమతి లక్ష్మీదేవి, ఏఎన్ఎం శ్రీమతి తిరుమల ,ఆశా వర్కర్లు ,డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమం రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల బీసీడీఈ సమన్వయకర్త డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో నిర్వహింపబడింది.