నేటి మన స్వాతంత్ర్య సంబరం ఎందరో సమరయోధుల త్యాగఫలం
1 min read– బీరం సుబ్బారెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మాతృభూమి కోసం తన ధన,మాన ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలను ,మన స్వేచ్ఛ స్వాతంత్ర కోసం అశువులు బాసిన సమరయోధులను స్మరించుకుంటూ బీరం విద్యాసంస్థల అధినేత బీరం సుబ్బారెడ్డి 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.బీరం పాఠశాల ఆవరణలో నేడు ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి రావడం జరిగింది. ముందుగా ముఖ్య అతిధి జాతీయ జెండా పతాక ఆవిష్కరణ గావించారు. మరియు జాతిపిత, భారత స్వాతంత్ర పోరాటానికి ముఖ్యుడైనటువంటి మహాత్మా గాంధీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిధి మాట్లాడుతూ ఎందరో సమరయోధుల పోరాట బలం,అమరవీరుల త్యాగఫలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, సామ్రాజ్యవాదుల సంకెళ్ళు తెంచుకొని, భరతజాతి విముక్తి పొందిన చరిత్రత్మాకమైన రోజు ఈ రోజు అని,వారందరినీ ఈరోజు మనం స్మరించుకోవాలని తెలిపారు.మన ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం చేసి వారిలో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించాలని తెలిపారు. అలాగే వైద్యరంగంలో వేదకాలం నుండి పేరు ప్రఖ్యాతలుగాంచిన దేశం మనదని,ప్రతి విద్యార్థి కూడా దేశం కోసం దేశభక్తి కలిగి ఉండాలని,విద్యార్థులు బాగా చదువుకొని దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని తెలిపారు. అలాగే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి యోధుల గురించి విద్యార్థులకు వారు వివరించారు. మరియు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలతో కార్యక్రమాన్ని అలరించారు.కార్యక్రమంలో బీరం విద్యాసంస్థల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్, పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత, కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్, అధ్యాపకులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.