నేటి బాలలే రేపటి పౌరులు : ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : నేటి బాలలే రేపటి పౌరులని పాఠశాలలో విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యాబోధనను బోధించే బాధ్యత ఉపాధ్యాయులదని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసుర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ప్యాపిలి పట్టణంలోని పెద్ద పూజర్ల రోడ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవానికి ప్రిన్సిపల్ మధుసూదన్ కుమార్ ఆహ్వానించగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవానికి ఆహ్వాన మేరకు ఆయన హాజరై పాఠశాలను ప్రారంభించారు. అలాగే ముందుగా పట్టణంలోని వేద పండితులు నామాల స్వామి తో ఆశీర్వాదం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పొంది, అనంతరం డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనారాయణమూర్తి తమ స్వగృహం నకు వెళ్లి అల్పాహారం భుజించి పాఠశాల ప్రారంభోత్సవానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, తెదేపా నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్ ఎంపీపీ టి. శ్రీనివాసులు, బత్తుల రామేశ్వర్ రెడ్డి, గొల్ల రామ్మోహన్ యాదవ్, గడ్డం అంకిరెడ్డి, చల్లా వీరాంజనేయులు, ఖాజాఫీర్, కడితం ప్రతాపరెడ్డి, గండికోట రామసుబ్బయ్య, నడిగడ్డ నాగేంద్ర,గండికోట పెద్ద రామాంజనేయులు, కొంగనపల్లి మధు, ఎస్ కే వలి, పుల్లయ్య బాలకృష్ణ, సుధాకర్, బాలు, హర్ష, వెంకటేష్, కలచట్ట ప్రసాద్, బాయి పల్లె లింగన్న, సుధాకర్, గుడిపాడు వెంకటరెడ్డి, తదితరులు తెదేప నాయకులు ,కార్యకర్తలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.