PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు పెద్దమ్మ దేవత 14వ వార్షికోత్సవం!

1 min read

-వార్షికోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ఆలయ నిర్వాహకులు 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలోని గుత్తి రోడ్డు, ఉప్పర వీధి కట్ట దగ్గర వెలసిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ దేవత 14వ వార్షికోత్సవ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ నిర్వాహకులు ఉప్పర భాస్కర్, యు.రవి, యు.వెంకటేశ్వర్లు, యు.నరసింహమూర్తి, యు.నరసింహులు, యు.బండల వీరేష్, యు.నాగేష్ తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో   మాట్లాడుతూ… శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ దేవత వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం గణపతి పూజ, పంచామృత అభిషేకం మరియు అర్చనలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 27వ తేదీ పెద్దమ్మ వార్షికోత్సవం భక్తుల నడుమ ఘనంగా  నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున భక్తులు శ్రీ పెద్దమ్మ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

About Author