PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: గంజి రాజశేఖర్

1 min read

నారాయణ స్కూలు లో ఘనంగా యోగ దినోత్సవం వేడుకలు  

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:   ప్రపంచవ్యాప్తంగా జరిగే యోగా డే ను శుక్రవారం నారాయణ స్కూల్ కరస్పాండెంట్ గంజి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక నారాయణ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే యోగ ఆసనాలు వేయించి యోగ పై చక్కటి అవగాహనను కల్పించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ గంజి రాజశేఖర్  మాట్లాడుతూ ఆరోగ్యకరంగా ఉండాలని అందుకు ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమం జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author