జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
1 min readగోనెగండ్ల లోని గాజులదిన్నె ప్రాజెక్టు ను, ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు
ఎమ్మిగనూరు లోని నవోదయ విద్యాలయాన్ని, అదోనిలోని ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన ఎం.పి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో ఎం.పి బస్తిపాటి నాగరాజు విస్తృతంగా పర్యటించారు.. గోనెగండ్ల మండలం లోని గాజులదిన్నె ప్రాజెక్టు తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ను, ఎమ్మిగనూరు లోని నవోదయ విద్యాలయాన్ని, ఆదోని లో ప్రభుత్వ వైద్య కళాశాల ను ఎం.పి సందర్శించారు… మొదటగా గాజులదిన్నె ప్రాజెక్టును సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి వాటి వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్బంగా ఎం.పి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు కేవలం కమీషన్ల కోసం నాసిరకం గా పనులు చేపట్టిందని ఆయన ఆరోపించారు..పనులు నాణ్యతతో జరగలేదని, కరకట్టలు బలహీనంగా కట్టారని, ఎక్కడ చూసినా మట్టి కట్టలు నెర్రలు ఇచ్చి బలహీనంగా ఉన్నాయన్నారు.. ప్రాజెక్టు లో 5.5 టి.ఎం.సీ ల నీరు నిల్వ ఉంచాలని చూస్తే , నాణ్యత సరిగ్గా లేదు కాబట్టి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయన్నారు.. ఈ ప్రాజెక్టు లో చేపడుతున్న పపనులను మంచి నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పనులను త్వరగా పూర్తి చేసేలా కృషి చేస్తానన్నారు.. ఇక ఈ ప్రాజెక్టు తో పాటు వేదవతి, గుండ్రేవుల , ఆర్.డీ.ఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే కరువు జిల్లా అయిన కర్నూలును సస్యశ్యామలం చేసుకోవచ్చన్నారు.. అనంతరం అక్కడే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల తో పాటు ఎమ్మిగనూరు బనవాసిలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శించిన ఎం.పి నాగరాజు, అక్కడి సమస్యల అడిగి తెలుసుకుని , సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఎం.పి.. తాను కూడా ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో నే చదువుకున్నాని, గవర్నమెంట్ బడుల్లో చదువుకోవడాన్ని చిన్న తనంగా భావించకుండా బాగా చదువుకొని మంచి స్థాయిలో స్థిర పడాలన్నారు.. బాగు పడాలన్న, చెడిపోవలన్నా విద్యార్థి దశ నుంచే మొదలవుతుందని, చదువును నిర్లక్ష్యం చేయకుండా అందరూ బాగా చదువుకొని జన్మించిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.. ఆ తరువాత ఆదోని నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ను సందర్శించిన ఎం.పి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు..ఈ సందర్భంగా అధికారులు తో భేటి అయిన ఎం.పి, పనుల్లో జరుగుతున్న జాప్యం, వైద్య కళాశాల కు కేటాయించిన నిధుల పై చర్చించారు..ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ కళాశాల నిర్మాణానికి రూ.475 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, వైద్య కళాశాల ను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఎం.పి నాగరాజు తెలిపారు.