PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే వర్గంలోకి పట్టణ కౌన్సిలర్లు..

1 min read

బైరెడ్డి వర్గం నుండి 11 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే సమక్షంలో చేరిక

ఎమ్మెల్యే వర్గానికే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కడానికి క్లియర్..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అనుకున్నది ఒక్కటి అయినది మరొక్కటిలా ఉంది పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది నంద్యాల జిల్లా నందికొట్కూరు అధికార తెలుగుదేశం పార్టీ.. అధికార పార్టీలోని ఒక వర్గం పట్టణ మున్సిపాలిటీనే కవసం చేసుకోవాలని అనుకుంటే వీరికంటే పైఎత్తులు వేసి కౌన్సిలర్లు ఈ వర్గంలో చేరడంతో పట్టణ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్లే..జులై 5వ తేదీన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.మున్సిపల్ పీఠం బైరెడ్డి వర్గానికి వెళ్లిందని నియోజకవర్గ ప్రజల నాడి తర్వాత రాజకీయాలు రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి అధికార పార్టీలో బుధవారం మధ్యాహ్నం అల్లూరులో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో 11 మంది కౌన్సిలర్లు 1వ వార్డ్ చిన్నరాజు,4 వార్డ్ బోయ జయమ్మ, 5 వార్డ్ రేష్మ,6 దేశెట్టి సుమలత,8 కరిష్మ,11 కొండ్రెడ్డి విజయమ్మ,13 శాంత కుమారి,14 అశోక్,15 కృష్ణ వేణి,19 లక్ష్మీదేవి,26 మందడి వాణి బైరెడ్డి వర్గం నుండి ఎమ్మెల్యే వర్గంలో టిడిపి పార్టీలో చేరారు. మున్సిపాలిటీలో మొత్తం 29 కౌన్సిలర్లు ఉండగా వీరిలో ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు రబ్బాని జాకీర్ హుస్సేన్ భాస్కర్ రెడ్డి ఉండవల్లి ధర్మారెడ్డి ఉన్నారు.నిన్న 11 మంది కౌన్సిలర్లు చేరడంతో ఎమ్మెల్యే వర్గానికి కౌన్సిలర్ల సంఖ్య 15 కు చేరడంతో మున్సిపల్ పీఠం వీరికే దక్కే అవకాశం మెండుగా ఉంది. అల్లూరులో పాత్రికేయులతో శివానందరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో కౌన్సిలర్లుగా గెలిచి మూడున్నర సంవత్సరాలు అయిందని పట్టణంలో ఎలాంటి అభివృద్ధి లేనందువల్ల ప్రజలు కౌన్సిలర్లను ప్రశ్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అనే నమ్మకంతోనే కౌన్సిలర్లు పార్టీలో చేరారని అన్నారు.ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ మేము వార్డుల్లో ఏమీ అభివృద్ధి చేయలేదనే బాధతోనే కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీకి ఆకర్షితులై వారు పార్టీలో చేరడం శుభ పరిణామం అని వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.కౌన్సిలర్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన అనంతరం శివానందరెడ్డిని మరియు ఎమ్మెల్యేను,మాండ్ర ఉమాదేవి ని భారీ గజమాలతో కౌన్సిలర్లు సన్మానించారు.

About Author